తెలంగాణలో పెరుగుతున్న కరోనా

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి రోజుకు వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి

Update: 2022-06-10 02:34 GMT

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి రోజుకు వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళనకల్గించే అంశమేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం 122 కరోనా కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు 811కు చేరుకున్నాయి.

ఎక్కువగా హైదరాబాద్ లో....
దీంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కొత్తగా నమోదయిన కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి. హైదరాబాద్ లో 94, మేడ్చల్, మల్కాజ్‌గిరి లో 9, రంగారెడ్డి జిల్లాలో 12, సంగారెడ్డిలో మూడు కేసులున్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు.


Tags:    

Similar News