తెలంగాణలో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులోనే 102 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.
తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఒక్కరోజులోనే 102 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎవరూ కరోనా కారణంగా మరణించలేదు. ఒక్కరోజులో 175 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. 102 కేసుల్లో 60 కేసులు హైదరాబాద్ లోనివేనని అధికారులు తెలిపారు.
రికవరీ శాతం...
తెలంగాణలో ఇప్పటి వరకూ 8,35,067 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 8,29,849 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా రికవరీ శాతం 99.37 శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 4,111 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనాయాక్టివ్ కేసులు 1,116 కు తగ్గాయని అధికారులు తెలిపారు.