నేడు కామారెడ్డి బంద్
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతు సంఘాలు నేడు కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చాయి.
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతు సంఘాలు నేడు కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందుకు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. మాస్టర్ ప్లాన్ తో తమ పొలాలను లాగేసుకుంటున్నారని, మాస్టర్ ప్లాన్ లో ఇండ్రస్ట్రియల్ జోన్ ను తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తూ నిన్న ఉదయం నుంచి రైతులు కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాన్ని కుటుంబాలతో సహా వచ్చి ముట్టడించారు.
కలెక్టర్ నిరాకరించడంతో...
అయితే రైతులతో చర్చలు జరిపేందుకు కలెక్టర్ ముందుకు రాలేదు. ఎస్సీ శ్రీనివాసరెడ్డి వచ్చి చర్చలు జరిపినా ఫలితం లేదు. తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వారికి మద్దతుగా నిలిచారు. అయితే కలెక్టర్ రైతులతో చర్చించేందుకు ముందుకు రాకపోవడంతో నేడు రైతు సంఘాలన్నీ కలసి కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చాయి.