కోవిషీల్డ్ రెండో డోస్ వ్యవధి తగ్గించండి
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి 12 వారాలు ఉండటంతో రెండో డోస్ వేయడం కష్టంగా మారిందని అన్నారు. వలస కూలీలు సయితం రెండో డోస్ వేసుకున్న తర్వాత వ్యవధి ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని, వారిని కనుగొనడం కష్టంగా మారిందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.
నాలుగు నుంచి ఆరు....
రెండో డోసు వ్యవధి ఎక్కువగా ఉండటంతో చాలా మందిలో నిర్లక్ష్యం కన్పిస్తుందని హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. రెండో డోస్ వ్యవధిని నాలుగు నుంచి ఆరు వారాలకు తగ్గించాలని మంత్రి కోరారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది కోవిడ్ టీకాలకు అర్హులుగా గుర్తించినట్లు హరీశ్ రావు తన లేఖలో పేర్కొన్నారు. హైరిస్క్ ఉన్న వారికి, హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ వేయాల్సి ఉందని, వారు రెండుడోసులు తీసుకుని చాలా కాలం అవుతుందని హరీశ్ రావు లేఖలో తెలిపారు.