ఒమిక్రాన్ రాలేదు.. ఆందోళన వద్దు

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Update: 2021-12-03 06:33 GMT

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కర్ణాటకలో మాత్రమే ఈ వేరియంట్ ప్రవేశించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ఆమె రక్తనమూనాలను జనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామన్నారు. ఫలితాలు మూడు, నాలుగురోజుల్లో వస్తాయని, అప్పుడు కానీ అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అన్నది తేలుతుందన్నారు.

అప్రమత్తంగా ఉండండి....
అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూచించారు. ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ తో శుభ్రపర్చుకోవడం, భౌతికదూరాన్ని పాటిస్తే కరోనాను నియంత్రించ వచ్చని హరీశ్ రావు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణలో ప్రవేశించిందన్న వార్తలను నమ్మవద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్ రావు కోరారు.


Tags:    

Similar News