సాగర్ గేట్లు ఎత్తి.. కిందకు నీటి విడుదల
భారీ వరద నీరు చేరుకోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు
భారీ వరద నీరు చేరుకోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తి కిందకు నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పరిధిలోని దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు మూడు సార్లు సైరన్ మోగించిన అనంతరం గేట్లను ఎత్తివేశారు. మొత్తం ఆరు గేట్లను ఎత్తి సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు.
ఆరు గేట్లను ఎత్తి..
నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్టు గేట్ల ద్వారా సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో సాగర్ ప్రాజెక్టు వద్దకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. సాగర్ అందాలను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు. పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు వస్తుండటంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు.