కేసీఆర్ కు నోటీసులు... జూన్ 15వ తేదీ వరకూ డెడ్ లైన్

విద్యుత్‌ కొనుగోళ్లు విషయంపై మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు నోటీసులు ఇచ్చామని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు

Update: 2024-06-11 12:59 GMT

విద్యుత్‌ కొనుగోళ్లు విషయంపై మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు నోటీసులు ఇచ్చామని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్‌ కొనుగోళ్లలో కేసీఆర్‌ తో పాటు 25 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. అయితే తమకు వివరణ ఇచ్చేందుకు కేసీఆర్‌ జులై 30వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు.

ఆలోగా వివరణ ఇవ్వాలని...
జూన్‌ 15వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు తాము గడువు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి చెప్పారు. 2016లో రెగ్యులేటరీ కమిషన్‌కు అరవింద్ కుమార్‌ విద్యుత్‌ కొనుగోళ్లపై ఆర్థిక భారం పడుతుందని.. ఓపెన్‌ బిడ్డింగ్‌ ద్వారా డబ్బు ఆదా అవుతుందని లేఖ రాశారని, ఆ తర్వాత సెక్రటరీగా లేనని అరవింద్ కుమార్ తెలిపారని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి చెప్పారు


Tags:    

Similar News