Gulf welfare: గల్ఫ్ సంక్షేమంకై చట్టం చేయాలి

గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ రూపకల్పన గురించి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని గల్ఫ్ కార్మిక నాయకుల బృందం.

Update: 2023-12-31 14:15 GMT

welfare of the Gulf 

Gulf welfare: గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ రూపకల్పన గురించి రాబోయే  బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని గల్ఫ్ కార్మిక నాయకుల బృందం సచివాలయంలో మంత్రి డి. శ్రీధర్ బాబును ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి మంత్రితో వివరంగా చర్చించారు.



కేరళ, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన గల్ఫ్ సంక్షేమ పథకాలను అధ్యయనం చేయాలని సూచించారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషయా చెల్లింపుకు వెంటనే జీ.ఓ.విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 

Tags:    

Similar News