మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి..!!

కేంద్ర మైనింగ్ మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా,మూసీనది పరివాహక ప్రాంతంలో పర్యటించి

Update: 2024-11-17 07:24 GMT

కేంద్ర మైనింగ్ మరియు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా,మూసీనది పరివాహక ప్రాంతంలో పర్యటించి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునరుజ్జీవన పథకం లో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు.అలాగే తర్వాత వాళ్ళ కష్ట సుఖాలను అడిగి,తెలుసుకుంటూ భాధితులతో మమేకం అవుతున్నారు..!!!

ఈ మూసీ నిద్ర కార్యక్రమంలో,అంబర్ పేటకు చెందిన తులసి రాం నగర్ లో నివసించే శంకరమ్మ ఇంటిని సందర్శించి, వాళ్ళ బాధలను పంచుకొని, కుటుంబ సభ్యులతో భోజనం చేసారు.!!

మూసీ నది పరివాహక ప్రాంతం కేవలం అక్కడ నివసించే వారే కాకుండా, కోటి మంది ప్రజల కాలుష్య వ్యర్థ పదార్థాలు, డ్రైనేజీ కారకాలు ప్రవాహ రూపంలో అక్కడికి తరలించబడుతున్నాయి..

తెలంగాణ ముఖ్యమంత్రి వీటిపై ఒక పద్దతి , ప్రణాలిక రుపొందించకుండా... కేవలం మూసీనది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజల ఇళ్ళను బుల్డోజర్లతో ఎలా పడగొట్టాలి అని మాత్రమే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజెండాగా మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు..

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ

* ప్రాజెక్టు కు సంబంధించిన పూర్తి వివరాలు (DPR),

* ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు పట్టే సమయం,

* ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమకూర్చాల్సిన నిధులు .

వీటిపై సందేహాలను ఆయన వ్యక్తపరిచారు..

ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచింది.. ప్రాజెక్టును పూర్తిగా రూపాంతరం చెందించి, కావాల్సిన అన్ని అనుమతులు పొందడానికి మరో రెండు సంవత్సరాలు పడుతుంది..

ఎన్నికల మూడ్ ఒక సంవత్సరం ముందునుండి ప్రారంభం అవుతుంది..

మిగిలింది ఒక సంవత్సరం...

ఈ ఒక్క సంవత్సరంలో మూసీ పునరుజ్జీవన పథకం ఎలా కంప్లిట్ చేస్తారో, నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు..!!

నల్లగొండ కు నీళ్ళు ఇవ్వడాన్ని మేం వ్యతిరేకం కాదని..నల్లగొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు..

నదీ పరివాహక ప్రాంతం ఎలా ఉంటుందో కూడా తెలియదు…

కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు..

కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ..!!??

ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదని ఆగ్రహించారు.

నిజాం పాలనలో,నాటి పాలకులు ఎటువంటి కూల్చివేతలు లేకుండా.. నదీ నీటి ప్రవాహాన్ని రిటైనింగ్ వాల్స్ (ప్రహారి గోడలు) ద్వారా విజయవంతంగా నిర్వహించగలిగారు..!!

ఇలాగే ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వం టాంక్ బండ్ లోని నీటిని శుద్ధి చేసి, కొబ్బరి నీళ్లు లాగా మారుస్తామని ప్రగల్భాలు పలికారు అని, చివరికి ఏమైందో అందరికీ తెలుసని, పేదలకు ఇబ్బంది కలగకుండా, వాళ్ళ ఇళ్ళు కూల్చకుండా చేసే ఏ అభివృద్ధి పనికైనా బీజేపీ మద్దతు ఇస్తుందని ఆయన తన వ్యాఖ్యలను ముగించారు..!!!

Tags:    

Similar News