Breaking : ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేలిద్దరూ ఓటమి.. వారితో పాటు చాలా మంది
కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే అభ్యర్థులలో చాలా మంది ఓటమి పాలయ్యారు
కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే అభ్యర్థులలో చాలా మంది ఓటమి పాలయ్యారు. మొత్తం తొమ్మిది మంది ఓటమి పాలయ్యారు. ఒక్క హైదరాబాద్ నగరంలో మినహా ఎక్కడా పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలు గెలవలేదు. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించగా, ఎల్.బి.నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా గెలుపుకు దగ్గరలో ఉన్నారు. అంతే తప్ప మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు.
ప్రలోభపెట్టారంటూ...
ప్రధానంగా బీజేపీ నేతలు తమను పార్టీ మారాలంటూ ప్రలోభపెట్టిందిన ఫార్మ్ హౌస్ లో జరిగిన ఘటనలో ఉన్న ఎమ్మెల్యేలిద్దరూ ఓడిపోయారు. తాండూరు నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, పినపాక నుంచి రేగా కాంతారావు కూడా ఓటమి చెందారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో రేగా కాంతారావు పై దాడికూడా జరిగింది. కానీ ఆ సింపతీ కూడా పని చేయలేదు. ఇక టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి మారిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా ఓటమి పాలయ్యారు.
వీరు కూడా...
వీరితో పాటు కొడంగల్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. అలాగే భూపాలపల్లి నుంచి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. ఇక ఖమ్మం జిల్లాలో పార్టీ మారిన హరిప్రియ నాయక్ కూడా ఓటమి పాలయ్యారు. ఇలా పార్టీ మారినోళ్లను ప్రజలు ఆశీర్వదించలేదు. తాము ఒకందుకు ఓటు వేస్తే మీరు అలా ఎలా పార్టీ మారతారని ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రశ్నించినట్లయింది.