Breaking : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్

మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ను వీడారు

Update: 2023-10-01 06:07 GMT

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతలు టిక్కెట్ల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా పార్టీ కోసం పడిన శ్రమకు ఫలితం టిక్కెట్ అన్నది అందరూ భావిస్తారు. కానీ తమకే టిక్కెట్ అనుకుంటున్న సమయంలో వారికి కాకుండా మరొకరికి టిక్కెట్ దక్కుతుందని తెలిస్తే అంతకు మించి షాక్ ఏముంటుంది? అందుకే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతుంటారు. అది అధికార పార్టీ కావచ్చు. లేక విపక్షాలు కావచ్చు. ఎక్కడైనా ఒకటే ఫార్ములా. ఫైనల్ డెస్టినేషన్ ఎన్నికల్లో పోటీకి దిగడమే.

కాంగ్రెస్ కండువాలు...
ఇప్పటి వరకూ తెలంాణాలో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో టిక్కెట్లు ఆశించిన ఎక్కువ మంది నేతలు వరస పెట్టి కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. కాంగ్రెస్ కూడా వచ్చిన నేతలందరికీ కండువాలు కప్పేస్తూ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో పడింది. ఢిల్లీలోనూ, ఇటు గాంధీభవన్ లోనూ కండువాల కప్పడం నిత్యం ఒక కార్యక్రమంలా మారింది. అధికార పార్టీలో టిక్కెట్ దక్కని నేతలందరూ క్యూ కడుతున్నా ఎవరినీ కాదనుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది.
మెదక్ జిల్లా అధ్యక్షుడిగా...
ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన తమకు చివరి నిమిషంలో టిక్కెట్ దక్కకపోతే కాంగ్రెస్ నేతలయినా ఎందుకూరుకుంటారు. వారు కూడా పార్టీని వీడతారు. అదే జరిగింది. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నది ప్రకటించకపోయినా ఆయన బీఆర్ఎస్ కు మద్దతు తెలిపే అవకాశాలున్నాయన్నది సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం.
మైనంపల్లి కుమారుడికి...
మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. తనకే టిక్కెట్ అనుకున్న సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ కు టిక్కెట్ కన్ఫర్మ్ చేశారన్న ప్రచారంతో ఆయన పార్టీని వీడారు. ఇప్పటి వరకూ పార్టీ కోసం తాను పడిన శ్రమంతా వృధా అయిందని తిరుపతి రెడ్డి ఆరోపిస్తున్నారు. పారాచూట్ నేతలకే కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందన్న కారణంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.
Tags:    

Similar News