రెండు రోజులు వర్షాలే
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం ప్రారంభమవుతుందని వెల్లడించింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్...
ఈరోజు, రేపు పెద్దపల్లి, నిర్మల్, అసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిిపింది. వర్షాల ఈ నెలాఖరు వరకూ పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తూ ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలలోని దక్షిణ భాగాలపై వ్యాపించి ఉందని తెలిపింది.