గవర్నరమ్మా.. ఆ తుషార్ కాదమ్మా
గవర్నర్ ఎందుకు అలా అనుకున్నారో తమకు అర్థం కావడం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.
గవర్నర్ ఎందుకు అలా అనుకున్నారో తమకు అర్థం కావడం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాము చెప్పిన తుషార్ వేరని, గవర్నర్ అనుకున్న తుషార్ వేరని ఆయన అన్నారు. తాము వాయనాడ్ లో రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ గురించి మాట్లాడితే గవర్నర్ తన వద్ద పనిచేసిన తుషార్ గురించి అని ఎందుకు అనుకున్నారో తమకు తెలియదని హరీశ్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్ ఎందుకు మాట్లాడారో తమకు అర్థం కావడం లేదని హరీశ్ రావు అన్నారు.
వందల కోట్లు...
వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్నారు. బీజేపీ ప్రయత్నించకుంటే ఆ పార్టీ కార్యదర్శి సిట్ విచారణ ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లారని హరీశ్ రావు ప్రశ్నించారు.తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని ఆయన అన్నారు. బీజేపీ నాటకాలను గమనించాలని కోరారు. దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే తప్పెలా అవుతుందని హరీశ్ రావు నిలదీశారు. బీజేపీ తన నేరాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ గవర్నర్ మాట్లాడటం సరికాదన్నారు. తమకు అంత అవసరం లేదని హరీశ్ రావు చెప్పారు.