వచ్చే ఎన్నికల ఫలితాలపై కేటీఆర్‌ జోస్యం

తెలంగాణలో రాజకీయాలు హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి మధ్య కొన్ని

Update: 2023-06-01 09:58 GMT

తెలంగాణలో రాజకీయాలు హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి మధ్య కొన్ని రోజులుగా వార్‌ నడుస్తోంది. అధికార పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా టార్గట్‌ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్‌పై కేటీఆర్‌ జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 90 నుంచి 100 సీట్లు వస్తాయన్నారు.

రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని పూర్తిగా కోల్పోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందని కేసీఆర్‌ ధ్వజమెతతారు. తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను పట్టించుకోవద్దని సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్షాల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు. తెలంగాణ క‌న్నా ఉత్త‌మ పాల‌న ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలి. తెలంగాణ క‌న్నా మెరుగైన మోడ‌ల్ రాష్ట్రాన్ని చూపించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

దేశం అన్ని రంగాల్లో వెనుకబడటానికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే.. లా అండ్‌ ఆర్డర్‌ను అదుపులో పెట్టాల్సిన హోంశాఖ మంత్రి అమిత్‌ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. ఓ వైపు అసదుద్దీన్‌ ఓవైసీ మాపై విమర్శలు చేస్తున్నారని, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ అనుసరిస్తున్న విధానాలు ఎంతో బాగున్నాయని చెబుతున్నారని తెలిపారు. డీలిమిటేషన్‌పై అన్ని పార్టీలు ఏకం కావాల్సి ఉందన్నారు. డీలిమిటేషన్‌ వల్ల దక్షిణ భారత్‌కు అన్యాయం జరుగుతోందన్నారు. 

Tags:    

Similar News