Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు.. అత్యవసరంగా రావాలంటూ?
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని కోరారు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీకి బయలుదేరి రావాలని కోరారు. మధ్యాహ్నం నుంచి జీవన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నట్టు సమాచారం. తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కూడా జీవన్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు.
ఎమ్మెల్సీ పదవికి...
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజల వద్దకు వెళతానని ఆయన మీడియాతో జరిగిన చిట్ చాట్ లో చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు బుజ్జగించినా ఆయన దిగిరాలేదు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని, అయితే పార్టీ మారే ఆలోచన లేదని ఆయన తెలిపారు. తనను ఏ పార్టీ కూడా సంప్రదించలేదని చెప్పారు. అయితే ఈరోజు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో జీవన్ రెడ్డి తన ఆలోచనను మార్చుకునే అవకాశముంటుందని తెలుస్తోంది. మరి ఢిల్లీ వెళ్లిన తర్వాత పార్టీ పెద్దలు ఇచ్చిన హామీతో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాలి.