Telangana : ఉచిత విద్యుత్తు పొందాలంటే...కండిషన్లు ఇవే
తెలంగాణలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తులు ప్రారంభించారు
తెలంగాణలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తులు ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తారు. గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్తు అందిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారంటీలలో ఇది ఒకటిగా ఉంది. దీంతో దీని అమలుకు కాంగ్రెప్ ప్రభుత్వం సిద్ధమయింది.
ఒక ఇంటికి ఇకే మీటరు...
అయితే ఒక ఇంటికి ఒక మీటరు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. కిరాయికి ఉండేవారు ఈ పథకానికి అర్హులు కారని చెబుతున్నారు. నెలకు రెండు వందల యూనిట్లు లోపు విద్యుత్తును వినియోగించే వారే గృహజ్యోతి పథకానికి అర్హులవుతారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి 2,181 వాడకం ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. దీంతో పాటు ప్రతి మీటరును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. అప్పుడే నిజమైన లబ్దిదారులకు పథకం అందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.