ఆ పరీక్షలు కూడా రద్దు చేయాల్సిందే

సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది

Update: 2023-04-10 04:26 GMT

tspsc jobs

టిఎస్పిఎస్సీ సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్ దాఖలయింది. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటీషన్ వేశారు.

పిటీషన్ పై...
డెబ్బయి ఆరు మంది అభ్యర్థులు ఈ పిటిషన్‌లో సంతకాలు చేశారు. జనవరి లో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు జరిగాయి. టీఎస్‌పీఎస్‌సి పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటీషనర్లు కోరారు. నేడు పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News