Breaking : పాలమూరులో తెలంగాణకు మోదీ వరాలు
తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు
తెలంగాణలో ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహబూబ్‌నగర్ లో జరిగిన s సభలో మాట్లాడుతూ ఈ రోడ్డు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు. అనేక కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. నా కుటుంబ సభ్యులారా అని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో అనేక కీలక ప్రాజెక్టులను ప్రారంభించామని చెపపారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు...
ఈ ప్రాజెక్టుల ద్వారా హనుమకొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. తెలంగాణకు పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రసంగించారు. రైతులకు ఈ పసుపు బోర్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఐదు మెగా ఫుడ్ ప్రాజెక్టులతో పాటు అనేక ప్రాజెక్టులను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజా గర్జన సభలో మోదీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. ములుగు జిల్లాకు గిరిజన యూనివర్సిటీని కూడా ప్రకటించారు. 900 కోట్ల రూపాయలతో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సమ్మక్క - సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు.