KTR : నేడు కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై విచారణ

ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

Update: 2024-12-27 03:53 GMT

ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదయిన ఏసీబీ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన కేటీఆర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ నెల 30వ తేదీ వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 30వ తేదీ వరకూ...
అదే సమయంలో ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంది. మరొక వైపు ఈ ఫార్ములా కారు రేసు కేసులో దర్యాప్తును ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి దానకిషోర్ ను విచారించి ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అధికారులు నేడు మరికొందరు అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశముంది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News