నెహ్రూ జూలాజికల్ పార్క్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్

గత రెండు రోజుల క్రితం జూ పార్క్ లో గంధపు చెట్లు స్మగ్లింగ్ అయినట్లుగా తెలుసుకున్న వెంటనే ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్..

Update: 2023-07-23 09:04 GMT

జూ పార్కులో ఏడు గంధపు చెట్లను నరికిన స్మగ్లర్లు

పుష్ప సినిమా తరహాలో గుర్తు తెలియని కొందరు స్మగ్లర్లు జూ పార్క్ లోకి ప్రవేశించి ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఏడు గంధపు చెట్లను నరికి చిన్న చిన్న దుంగలు చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో చిక్కకుండా తప్పించుకున్న హైలెట్ ఘటన హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో గత రెండు రోజుల క్రితం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. 
నెహ్రూ జూలాజికల్ పార్క్ లో వన్యప్రాణులతో పాటు ఖరీదైన గంధపు చెట్లు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గుర్తుతెలియని కొందరు దుండగులు జూ పార్కులోకి చొరబడి గుట్టు చప్పుడు కాకుండా ఏడు గంధపు చెట్లను నరికి వేశారు. అనంతరం ఆ స్మగ్లర్లు వాటిని దుంగలు దుంగలుగా కట్ చేసి అక్కడనుండి తీసుకువెళ్లారు. ఆ విధంగా దుంగలు తీసుకెళ్లిన సమయంలో కొన్ని దుంగలు పార్కులో అక్కడ అక్కడ పడిపోయాయి. ఈనెల 20వ తేదీన జూ పార్క్ అధికారులు దుంగలను గుర్తించి చుట్టూ పరిశీలించగా ఏడు గంధపు చెట్లను నరికినట్లుగా గుర్తించారు. అందులో కొన్ని దుంగలు మాత్రమే జూ పార్క్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో జూ అధికారులు వెంటనే అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు జూపార్క్ కు రెండు వైపులా ఉన్న ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు.
రెండు గేట్ల గుండా గంధపు దుంగలు తీసుకెళ్లడం లాంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో కనిపించక పోవడంతో అధికారులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. అయితే అధికారులు పార్కులో నరికిన గంధపు చెట్లనుండి కొన్ని దుంగలు కనిపించకుండా పోయిన వాటిని ఎలా తస్కరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. స్మగ్లర్లు జూ పార్కులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కు చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జూలో ఎక్కడ ఏముంది ? అన్ని విషయాలు తెలిసిన ఇంటి దొంగ పనేనా? అనే కోణంలో పోలీసులు, ఉన్నతాధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తు కొనసాగించారు. స్మగ్లర్లు గత రెండు రోజుల క్రితం కూడా గంధపు చెట్లను నరికిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గత ఆరు సంవత్సరాల్లో ఐదుసార్లు స్మగ్లర్లు ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. అప్పటినుండి ఇప్పటివరకు ఒక్కరు కూడా పోలీసుల చేతికి చిక్కకపోవడం విశేషం.

జూ లో గంధం చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

గత రెండు రోజుల క్రితం జూ పార్క్ లో గంధపు చెట్లు స్మగ్లింగ్ అయినట్లుగా తెలుసుకున్న వెంటనే ప్రిన్సిపల్​ చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్​ (పీసీసీఎఫ్​) లోకేష్​ జై స్వాల్​ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం జూపార్కులో పరిసరాలలో అదనంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, మరింత భద్రతను పెంచి కట్టుదిట్టం చేయాలని పీసీసీఎఫ్​ లోకేష్​ జై స్వాల్​ జూ అధికారులను ఆదేశించారు. అనంతరం జూ పార్కులో జూ అధికారుల తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని క్యూరేటర్​కు సూచించారు. సీసీ కెమెరాలను ఎక్కువగా పెట్టడమే కాకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీని కూడా నియమించాలన్నారు. అలాగే జూ పార్క్ చుట్టూ ఎలక్ట్రికల్​ ఫెన్సింగ్​ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జూపార్కులో జంతువుల సంరక్షణ, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను గురించి అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు... ఈ సమావేశంలో జూ పార్కు డైరెక్టర్​ వినయ్​కుమార్​, క్యూరేటర్​ ప్రశాంత్​ బాజిరావు పాటిల్​ తో పాటు జూ అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News