స్నేక్ తో గేమ్స్.. ప్రాణాలుపోయాయిగా?

బాన్సువాడ మండలం దేశాయిపేటకు చెందిన శివరాజు స్నేక్ క్యాచర్. అయితే పాములను పడుతూ ఉంటాడు

Update: 2024-09-07 02:03 GMT

నేటి యువత సోషల్ మీడియాలో వ్యూస్ సంపాదించడం కోసం ఎలాంటి సాహసానికైనా ఒడిగడుతున్నారు. రీల్స్ కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. అలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో జరిగింది. బాన్సువాడ మండలం దేశాయిపేటకు చెందిన శివరాజు స్నేక్ క్యాచర్. అయితే పాములను పడుతూ ఉంటాడు.

పామును నోట్లో పెట్టుకుని...
గ్రామంలోకి నాగుపాము వచ్చిందని శివరాజుకు ఫోన్ చేయగా అక్కడకు వెళ్లాడు. నాగుపామును పట్టుకున్నాడు. చాలా సేపు దానితో ఆడాడు. చివరకు నాగుపామును నోట్లో పెట్టుకుని ఫొటోలు తీయించుకున్నాడు. నాగుపామును ఒడిసి పట్టే దశలో అతని చేతిపై పాము కాటేసింది. వెంటనే శివరాజును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Tags:    

Similar News