సుప్రీంకోర్టుకు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది
ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే విచారణ చేపట్టాలని కోరింది. సీబీఐ విచారణ జరిపితే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు.
వచ్చే వారం...
అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాత్రం వచ్చే వారం ఈ కేసును విచారిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులోని సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్ కూడా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. వచ్చే వారం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.