ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సర్కార్ నయా ప్లాన్

బాసర ట్రిపుల్ ఐటీలో ఆరో రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. అధికారులు, మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

Update: 2022-06-19 08:18 GMT

బాసర ట్రిపుల్ ఐటీలో ఆరో రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. అధికారులు, మంత్రులు విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆందోళనలను ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం పీయూసీ 1, పీయూసీ 2 విద్యార్థులను అవుట్ పాస్ ఇచ్చి బయటకు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వారి తల్లిదండ్రులకు కూడా మెసేజ్ లు ఇచ్చారు. దీంతో ఆందోళనలో ఉన్న రెండు వేల మంది విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది.

12 డిమాండ్లను...
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆరు రోజుల నుంచి ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థులు తమ 12 డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని కోరుతున్నారు. డిమాండ్ల పరిష్కరానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించడం లేదని చెబుతున్నారు. తమ ఆందోళన మాత్రం కొనసాగుతుందని చెబుతున్నారు. నిన్న మంత్రులు జరిపిన చర్చలు కూడా విఫలమయినట్లే అనుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆందోళన విరమింప చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది.


Tags:    

Similar News