దళిత బంధు అందరికీ అందాల్సిందే
దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు
దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆయన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దళితబంధు పథకం పై ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. దళితబంధును అమలు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలందరూ సూచించారు.
అధికారుల నివేదికలో....
కానీ అంతకు ముందు అధికారులు మాత్రం తమ నివేదికలో దశలవారీగా అమలు చేయాలని తెలిపారు. కానీ కేసీఆర్ అధికారుల ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. రైతులందరికీ రైతు బంధు, దళితులందరికీ దళితబంధు పధకాన్ని అందించాల్సిందేనని కేసీఆర్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసినట్లు తెలిసింది.