గుడ్ న్యూస్: రుణమాఫీ మార్గదర్శకాలు వచ్చేశాయి
తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పంట రుణమాఫీ ఒకటి
తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పంట రుణమాఫీ ఒకటి. ఎప్పుడు అమలు చేస్తారా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలపై ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనికి రేషన్ కార్డు ప్రామాణికమని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.