కేసీఆర్ కు సుప్రీంకోర్టు బర్త్‌డే గిఫ్ట్

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Update: 2023-02-17 07:42 GMT

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన 900 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్జీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఎన్జీజీ జరిమానాపై...
అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా 900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించుకోవచ్చని ఆదేశించింది. జరిమానాపై కూడా స్టే విధించింది. కేసీఆర్ పుట్టిన రోజు నాడు ఈ తీర్పు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలను మరింత ఆనందంగా చేసుకుంటున్నాయి.


Tags:    

Similar News