Telangana : నేడు కొత్త టీచర్లకు గుడ్ న్యూస్.. నియామకపత్రాల అందచేత

తెలంగాణ ప్రభుత్వం నేడు ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నియామక పత్రాలను అందచేయనుంది.

Update: 2024-10-09 02:29 GMT

తెలంగాణ ప్రభుత్వం నేడు ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నియామక పత్రాలను అందచేయనుంది. ఇటీవల డీఎస్సీ 2024 లో సెలెక్ట్ అయిన వారికి టీచర్లుగా నియామకపత్రాలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందచేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీస్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఎల్బీస్టేడియంలో...
మొత్తం 10,006 మందికి ఈ నియామక పత్రాలను నేడు రేవంత్ రెడ్డి అందచేయనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు పరీక్ష నిర్వహించగా అందులో 10,006 మందిని మాత్రమే టీచర్లుగా ఎంపిక చేశారు. కోర్టు సమస్యల వల్ల కొన్ని పోస్టుల భర్తీని నిలిపివేశారు. ఎంపికయిన టీచర్లు మధ్యాహ్నం రెండు గంటల్లోగా ఎల్బీ స్టేడియానికి చేరుకోవాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News