తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఓఆర్ఆర్ నుంచి గరుడ ఏసీబస్సులు

తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది.;

Update: 2024-09-30 04:18 GMT
telangana rtc, gurada ac buses, vijyawada, orr, telangana rtc takes new decisions from time to time and tries to increase revenue, telangana rtc news today

Telangana rtc

  • whatsapp icon

తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలను తీసుకుంటూ ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి నష‌్టం రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కొత్త బస్సులను ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీజీ ఆర్టీసీ ప్రయత్నిస్తుంది.

ఓఆర్ఆర్ మీదుగా....
ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌కు ఈ-గరుడ ఏసీ బ‌స్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. మొదటి దశలో భాగంగా ఈరోజు రెండు ఈ-గరుడ బస్సులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు ఎక్స్ లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్మమ్మను దర్శించుకునే వారి కోసం ఈ బస్సులను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News