తొమ్మిదేళ్ల తర్వాత చెప్పులు ధరించిన రైతు

బాల్కొండ నియోజకవర్గంలోని పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి

Update: 2023-10-02 09:10 GMT

బాల్కొండ నియోజకవర్గంలోని పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత కాళ్లకు చెప్పులు ధరించారు. అందుకు కారణం పసుపు బోర్డు వచ్చేవరకు చెప్పులు వేసుకోనని చేసిన ప్రతిజ్ఞ. పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు ధరించబోనని 2014లో ఆయన ప్రతిజ్ఞ చేశాడు. పసుపు బోర్డు కోసం రైతులతో కలిసి పాదయాత్ర చేసిన ఆయన అప్పటి నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పసుపుబోర్డు ప్రకటించడంతో తిరిగి ఆయన చెప్పులు ధరించారు. తొమ్మిదేళ్ల పాటూ ఎక్కడకు వెళ్లినా ఆయన చెప్పులు వేసుకోలేదు. వ్యవసాయం చేయడానికి పొలం దగ్గరకు వెళ్లాలన్నా.. ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా ఆయన చెప్పులు ధరించేవారు కాదు. తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా రైతులు సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పసుపు చల్లుకుంటూ ఆనందం పంచుకున్నారు. ముత్యాల మనోహర్‌రెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత కాళ్లకు చెప్పులు వేసుకున్నారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. బోర్డు కోసం పలుమార్లు ఉద్యమాలు కూడా జరిగాయి. పాలమూరు ప్రజాగర్జనలో ప్రధాని మోదీ తెలంగాణలో జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాన్నామని తెలిపారు. పసుపు రైతుల కష్టాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కరోనా తర్వాత పసుపు వినియోగం పెరిగిందన్నారు. తెలంగాణలో రైతులు పసుపును ఎక్కువ పండిస్తున్నారని చెప్పారు. పసుపు బోర్టు ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు.


Tags:    

Similar News