కేసీఆర్ సవాల్ ను స్వీకరించిన కిషన్ రెడ్డి .. అయితే ఒక కండిషన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరుపున అమరవీరుల స్థూపం వద్ద చర్చించేందుకు తాను సిద్ధమని కిషన్ రెడ్డి ప్రకటించారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ఏ వర్గానికి ఏం చేశారన్నది తాను చెప్పగలనని అన్నారు. అయితే ఈచర్చలో కేసీఆర్ సరైన భాషను మాట్లాడాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ కండిషన్ కు అంగీకరిస్తే తాను చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి తెలిపారు.
చర్చకు సిద్ధం...
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. నదులను అనుసంధానం చేస్తామన్నా విమర్శిస్తున్నారన్నారు. 64 వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. తెలంగాణలో వివిధ పథకాల పేరుతో దోపిడీ జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరధ పేరు మీద పెద్దయెత్తున నిధులు దుర్వినియోగం అయ్యారన్నారు.