తెలంగాణ ఎంపీలతో మోదీ ఏమన్నారంటే?
తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు;
తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. అయితే ఈసమావేశంలో మోదీ మాట్లాడుతూ తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలని కోరారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోందని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారన్నారు.
మనదే ప్రభుత్వం...
అంతేకాకుండా బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారన్న మోదీ, ప్రజలు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉండాలని, బీజేపీ కార్యకర్తలు పార్టీ అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.