అవును .. వీళ్లిద్దరూ విడిపోయారు

ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య పెళ్లయి దశాబ్దకాలం దాటింది. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు

Update: 2022-01-18 02:42 GMT

సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నంత తొందరగానే విడిపోవడం జరగుతుంది. అనేక మంది సినీ ప్రముఖులు పెళ్లి విషయంలో వెనకా ముందు చూడకుండా నిర్ణయం తీసుకోవడం, కొంత కాలం గడిచిన వెంటనే విడాకులు తీసుకోవడం అలవాటుగా మారింది. ఇద్దరిలో ఎవరిది తప్పయినా జంట విడిపోయే పరిస్థిితి. సర్దుకు పోయే మనస్తత్వం అతి కొద్దిమందికే ఉంది. మొన్న చైతు, సమంత జంట విడిపోగా, నేడు ధనుష్, ఐశ్వర్య జంట విడిపోయింది.

కారణాలు తెలియకున్నా....
ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య పెళ్లయి దశాబ్దకాలం దాటింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కారణాలు తెలియకపోయినా ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకించారు. తాము 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యాభర్తలుగా ప్రయాణం చేశామని, ఇప్పుడు వేర్వేరు దారుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ధనుష్ వెల్లడించారు. దీంతో కారణాలు తెలియకపోయినా విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది.


Tags:    

Similar News