తప్పు చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే నాకు బుద్ధి చెబుతారు
తాను ఎటువంటి తప్పు చేసినా వచ్చే ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెబుతారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరును అన్ని రకాలుగా అభివృద్ధి [more]
తాను ఎటువంటి తప్పు చేసినా వచ్చే ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెబుతారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరును అన్ని రకాలుగా అభివృద్ధి [more]
తాను ఎటువంటి తప్పు చేసినా వచ్చే ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెబుతారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని తెలిపారు. జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వందకోట్ల రూపాయలతో పెన్నా నదిపై మరో వంతెన నిర్మాణం జరుగుతుందన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో నెల్లూరు కు ఇచ్చిన హామీలన్నీ పూర్తవుతాయని అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. రాజకీయ విమర్శలు చేసే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. తాను చిల్లర రాజకీయాలు చేయబోనని చెప్పారు.