దిక్కులేకనే ఆ దిక్కుకు వెళ్లాడు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థులు దొరికే దిక్కులేకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆశ్రయించారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థులు దొరికే దిక్కులేకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆశ్రయించారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో [more]
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థులు దొరికే దిక్కులేకనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆశ్రయించారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో చర్చించకుండా ఏకపక్షంగా వాయిదా నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబుది నీచమైన ఎత్తుగడ అని ఆయన అన్నారు. వచ్చే రోజుల్లో కరోనా ఇంకా పెరిగే అవకాశముందని అనిల్ యాదవ్ ఉన్నారు. ఈలోపు ఎన్నికలు జరిపి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కరోనా కంటే చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద వైరస్ లా మారారన్నారు. వారం రోజులు ఆగి ఉంటే రాష్ట్రానికి ఐదు వేల కోట్లు వచ్చే వన్నారు. అభ్యర్థులు లేకనే టీడీపీ కుట్రలు చేసిందన్నారు.