రేవంత్ రెడ్డి నివేదికలో ఏముందంటే?
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారయింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారయింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపు ఖరారయింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సర్వేలు కూడా నిర్వహించారు. సామాజికవర్గాల సమీకరణలో భాగంగా నివేదికను రూపొందించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కమిటీ అన్ని అంశాలను పరిశీలించింది. ఈ నివేదికను రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారా ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ కు అందించారు. దామోదర రాజనర్సింహ, కంభంపల్లి సత్యనారాయణ, కొండా సురేఖ పేర్లు ప్రధానంగా వచ్చాయి. మాణికం ఠాగూర్ నివేదికతో ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఒకట్రెండు రోజుల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని హైకమాండ్ ప్రకటించే అవకాశముంది.