దుర్గగుడి ఈవో బదిలీ.. అవినీతి ఆరోపణలే కారణం

దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ బాబును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇటీవల [more]

;

Update: 2021-04-08 01:20 GMT
దుర్గగుడి ఈవో బదిలీ.. అవినీతి ఆరోపణలే కారణం
  • whatsapp icon

దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ బాబును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇటీవల ఏసీబీ జరిపిన విచారణలో దుర్గగుడిలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. టెండర్ల విషయంలోనూ ఈవో సురేష్ బాబు నిబంధనలను తుంగలో తొక్కారని పేర్కొంది. దీంతో సురేష్ బాబు పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

Tags:    

Similar News