అయోధ్యకి చేరిన నేపాల్ బహుమతులు
అయోధ్యలో సీతారాముల ప్రతిష్టకు సమయం ఆసన్నం అవుతున్న వేళ... సీతమ్మ పుట్టింటి నుంచి అయోధ్యకి సారె వచ్చి చేరింది. వెండి పాదుకలు, బంగారం, వెండి ఆభరణాలు, రకరకాల ఫలాలు, డ్రై ఫ్రూప్ట్స్, స్వీట్లు, వస్త్రాలు వంటి 3000 రకాల బహుమతులను... జనకపురిలోని రామ్ జానకి ఆలయ ప్రధాన పూజారి రామ్ రోషన్ స్వయంగా రామ జన్మభూమి ట్రస్ట్ కి అందించారు. ఈ బహుమతులతో కూడిన వాహనాల శ్రేణి కరసేవకపురానికి కోలాహంగా చేరింది.

జనక పురి నుంచి బయలుదేరిన మూడు డజన్ల వాహనాల సముదాయం నేపాల్ నుంచి 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అయోధ్యలోని కరసేవకపురం వచ్చినట్లు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపేట్ రాయ్ చెప్పారు. అయోధ్యకు, నేపాల్ కి మధ్య సంబంధాలు త్రేతా యుగం నుంచి కొనసాగుతున్నాయని రాయ్ పేర్కొన్నారు. రాముడి అత్తింటి నుంచి సారె చేరడంతో, ఈ వార్త రామ భక్తుల్లో ఆనందాన్ని నింపుతోంది.
'మాకు ఎప్పుడూ నేపాల్ అంటే చాలా గౌరవం. అది జానకి మాత పుట్టిల్లు' అని అయోధ్య మేయర్ మహంత్ గిరీష్ త్రిపాఠి చెప్పారు. పురాణాల ప్రకారం సీతారాముల వివాహం మార్గశిర మాసం, శుక్ల పక్షం ఐదో రోజు (పంచమి)నాడు జరిగింది. ప్రతి ఏడాది అదే రోజునాడు వివాహ పంచమి తిధి అని అయోధ్యలో వేడుకలు జరుపుతారు. జనక పురి లో ఆ రోజు ప్రత్యేక ఉత్సవాలు జరగడం విశేషం.