టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
బంగారం ధరలు మాత్రం తగ్గాయ్... అనకాపల్లి నుంచి అమెరికా వరకూ సంక్రాంతి సంబరాలే, టీడీపీకి రాజీనామా చేస్తున్నా పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Gold Prices : బంగారం ధరలు మాత్రం తగ్గాయ్... వెండి ధరలు మాత్రం?
బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని మార్కెట్ నిపుణులు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కొంత ధర తగ్గుముఖం పట్టడం సంతోషించ దగ్గ విషయం. గత కొద్ది రోజులుగా స్థిరంగా కొన్ని రోజులు, స్వల్పంగా ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు దారులు కూడా ఊరట చెందుతున్నారు.
రాముని రాకే.. మాకు మంచి ముహూర్తం
అయోధ్య రామ మందిర పునఃప్రారంభోత్సవం దేశమంతా పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎన్నో మంచి పనులకి ఆ రోజే శ్రీకారం చుడుతున్నారు. రాముని ప్రతిష్ట సమయమే అద్భుతమైన ముహూర్తం అని కాబోయే తల్లులంతా ఫిక్స్ అయినట్లున్నారు. దేశవ్యాప్తంగా ఆ ముహుర్తానికే తమకు బిడ్డ పుట్టాలని ఆశిస్తున్నారు.
Sankranthi : అనకాపల్లి నుంచి అమెరికా వరకూ సంక్రాంతి సంబరాలే
సంక్రాంతి అంటే చాలు.. పిల్లా పెద్దలు అందరూ ఎంత షుషారయిపోతారంటే చెప్పటం ఎవరి వల్లా కాదు. ఏటా వచ్చే పండగే అయినా సంక్రాంతికి అదో స్పెషల్. కొత్త బట్టలు.. సొంతూళ్లకు పయనం.. కడుపునిండా తినేటంత స్వీట్లు.. హాట్లు... ఇలా ఒక్కటేమిటి.. సంక్రాంతి అంటేనే రంగుల పండగ.
Ruhani Sharma : ఈ హీరోయిన్ విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందట..
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న రుహాణి శర్మ.. విరాట్ కోహ్లీకి మరదలు అవుతుందట. ఈ విషయం ఆమె కన్ఫార్మ్ చేసింది. రీసెంట్ గా రుహాణి శర్మ భామ ఒక షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు.
Chandrababu : హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. బెయిల్ పిటీషన్లపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇసుక కుంభకోణం, లిక్కర్ స్కాంకు సంబంధించి కేసుల్లో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.
Big Breaking : చంద్రబాబు పచ్చి మోసగాడు.. టీడీపీకి రాజీనామా చేస్తున్నా.. వైసీపీలో చేరుతున్నా
గత రెండు ఎన్నికల్లో తాను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ నుంచి గెలిచానని, అయితే చంద్రబాబు తనను వద్దనుకున్నారన్ని కేశినేని నాని అన్నారు. జగన్ తో మాట్లాడి వచ్చిన తర్వాత కేశినేని మీడియాతో మాట్లాడారు. కేశినేని నాని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అరుణ‌్ కుమార్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో కలసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. జగన్ తో సమావేశమయ్యారు.
Tax Saving: ట్యాక్స్‌ను ఆదా చేసుకునే బెస్ట్ స్కీమ్స్ ఇవే
ఈ రోజుల్లో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందవచ్చు. కానీ కొన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇలాంటి పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Breaking : వాహనదారులకు శుభవార్త... పెండింగ్ చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు
తెలంగాణలో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు రాయితీ పొందడానికి ప్రభుత్వం గడువు పెంచింది. ఈ నెల 31 వతేదీ వరకూ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 3.09 కోట్ల దాకా పెండింగ్ చలాన్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్ల ద్వారా 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Ambati Rayudu : రాయుడు గారు.. గాజు గ్లాసు... భళ్లున బద్దలయిపోతుందా?
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ను కలిశారు. ఆయనతో మూడు గంటల పాటు చర్చించారు. ఇద్దరి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. అంబటి రాయుడు పదిహేను రోజుల క్రితం వైఎస్ జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.
Mahesh Babu : సంక్రాంతి రేసులో మహేష్ ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచాడు..?
గుంటూరు కారం' సినిమాతో మహేష్ బాబు ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అయితే మహేష్ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నిసార్లు సంక్రాంతి రేసులో పోటీ చేసి గెలిచారు..? సంక్రాంతి బరిలో మహేష్ బాబు ఇప్పటికి ఆరు సార్లు పోటీ చేశారు. మరి ఆ చిత్రాలు ఏంటి..? వాటి ఫలితాలు ఏంటో ఓ లుక్ వేసేయండి..