13August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్కే బీచ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో మంటలు చెలరేగాయి. డైనో పార్క్ మొత్తం మంటల్లో బూడిదగా మారింది. పెద్దయెత్తు మంటలు ఎగిసిపడుతుండటంతో ఆర్కే బీచ్ వద్ద ఉన్న పర్యాటకులు భయాందోళనలతో పరుగులు తీశారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Breaking : విశాఖ బీచ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం
విశాఖలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్కే బీచ్ వద్ద ఉన్న డైనో పార్క్ లో మంటలు చెలరేగాయి. డైనో పార్క్ మొత్తం మంటల్లో బూడిదగా మారింది. పెద్దయెత్తు మంటలు ఎగిసిపడుతుండటంతో ఆర్కే బీచ్ వద్ద ఉన్న పర్యాటకులు భయాందోళనలతో పరుగులు తీశారు. డైనో పార్క్ ను ఒక ప్రయివేటు సంస్థ నిర్వహిస్తుంది.
Botsa Satyanarayana : సత్తిబాబుకు అదృష్టం అలా కలసి వచ్చిందంతే? గ్యాప్ రాకుండా లక్కీ ఛాన్స్ వచ్చేసిందిగా?
బొత్స సత్యనారాయణ సీనియర్ నేత. ఆయన ఇప్పటికి రెండు సార్లు మాత్రమే చీపురుపల్లిలో ఓటమి పాలయ్యారు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో డిపాజిట్ వచ్చిన ఏకైక కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ మాత్రమే.
Telangana : వామ్మో పది రోజుల్లో ఇన్ని డెంగీ కేసులా? తెలంగాణకు వైరల్ ఫీవర్
తెలంగాణలో డెంగీ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డెంగీ కేసులతో పాటు వైరల్ ఫీవర్ తో ప్రజలు ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో రోజుకు వెయ్యి మంది వరకూ అవుట్ పేషెంట్ విభాగానికి వస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి కూడా ఇదేరకంగా పేషెంట్లు వస్తున్నారు.
Nara Lokesh : నారా లోకేష్ కామ్ గా పనిచేసుకు పోతున్నారా? బయటకు కనిపించకుండా సెట్ చేస్తున్నారా?
నారా లోకేష్ రాజకీయాల్లో రాటు దేలారు. ఆయన తన తండ్రి చంద్రబాబు నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. 2014 ఎన్నికల్లో గెలవకపోయినా మంత్రి అయిన నారా లోకేష్ అప్పడు అంతా తానే వ్యవహరించేవారు. తన శాఖలు మాత్రమే కాదు ఇతర శాఖల్లోనూ వేలు పెట్టేవారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
Telangana : నేటితో ముగియనున్న రేవంత్ రెడ్డి విదేశీ టూర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పది రోజులకు పైగానే విదేశీ పర్యటనలో ఉన్నారు. తొలుత అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం అనేక పెట్టుబడులు సాధించింది.
Vinesh Phogat : నేడు తేలనున్న వినేశ్ ఫొగాట్ మెడల్ వ్యవహారం
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు మెడల్ పై నేడు స్పష‌్టత రానుంది. ఈరోజు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తీర్పు చెప్పనుంది. వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించే దశలో ఆమె అనర్హత వేటు పడింది. ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.
దానం నాగేందర్ పై కేసు నమోదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన భూమిలో ఉన్న కాంపౌండ్ వాలన్ ను కూల్చి వేశారని ఆయనపై ఈ కేసు నమోదయింది.
Leopard : శ్రీశైలంలో చిరుతపులి.. భయాందోళనలో భక్తులు
శ్రీశైలంలో చిరుతపులి సంచారంతో భక్తులు భయపడిపోతున్నారు. పాతాళగంగ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఉన్న ఆలయానికి చెందిన ఏఈఓ ఇంటివద్ద రాత్రి చిరుతపులి కనిపించింది. ఇంటి ప్రహరీగోడపై చిరుత నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Congress : నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. పీసీసీ ఛీఫ్‌ల ఎంపికపై
నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అతి త్వరలోనే తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి కొత్త పీసీసీ అధ్యక్షుల నియమాకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన వంటి విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
ACB Raids : ఏసీబీ వలలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్ రెడ్డి కూడా ఏసీబీ అధికారులు దొరికిపోయారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి భూపాల్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలను బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశారు.