15August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

వరుస సెలవుల నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడం తో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ప్రజలు బయలుదేరి వెళుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో కొంత ఆలస్యమవుతుంది.

Update: 2024-08-15 12:00 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

వరస సెలవులు... టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ

వరుస సెలవుల నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడం తో హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ప్రజలు బయలుదేరి వెళుతున్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీతో కొంత ఆలస్యమవుతుంది.

Telangana : నేటితో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు నేటితో రుణమాఫీని పూర్తి చేయనుంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్న రైతులకు నేటి నుంచి మాఫీ అయ్యే కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

Breaking : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

 హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంబర్‌పేట్‌లో ఉన్న ఆలీ కేఫ్ వద్ద ఉన్న పెయింట్స్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటల్లో పలువురు మహిళలు చిక్కుకున్నారు. పెయింట్ డబ్బాలు తగలపడుతుండటంతో పెద్దయెత్తున మంటలతో పాటు పొగ కూడా అలుముకుంది.

Chandrababu : గుడివాడలో అన్నా క్యాంటిన్ ప్రారంభం

గుడివాడలో అన్నా క్యాంటిన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అన్నా క్యాంటిన్ ను చంద్రబాబు గుడివాడలో ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి స్వయంగా అక్కడ భోజనం చేశారు.

ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ వరసగా పదకొండోసారి ప్రధాని హోదాలో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎర్రకోట జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిధులతో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు హాజరయ్యారు. మొత్తం ఆరువేల మంది హాజరయ్యారు.

సీతారామ ప్రాజెక్టు ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి గూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు. జిల్లాలోని పూసుగూడెంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరావులు పాల్గొన్నారు.

Pawan Kalyan : ఆ ఆలోచనే నన్ను ఈ స్థాయికి చేర్చింది

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. స్వతంత్రం వచ్చిందని ఆనంద పడే కంటే దేశ బాధ్యతను గుర్తుచేసుకునే రోజు అని ఆయన అన్నారు.

Balineni : బాలినేని వైసీపీని వదిలేసినట్లుందిగా...పార్టీ ఏమైపోతే నాకేమన్నట్లు వ్యవహరించడం అందుకేనా?

ఒంగోలు జిల్లాలో వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాంగ్రెస్ నాటి నుంచి వైసీపీ వరకూ ఆ పార్టీకి నాయకత్వ సమస్య లేదు. క్యాడర్ పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక నియోజకవర్గాలు ఎప్పుడూ వైసీపీ ఖాతాలోనే పడేవి.

Chandrababu : సూపర్ సిక్స్ ను త్వరలోనే అమలు చేస్తాం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగంతో ఏర్పడిన స్వాతంత్ర్య ఫలాలను నేడు అనుభవిస్తున్నామని తెలిపారు.

Revanth Reddy : త్వరలోనే రైతు భరోసా.. అర్హులైన అందరికీ ఇస్తాం

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాంగ్రెస్ దేశంలో చేసిన సేవలకు ఉదాహరణే ప్రాజెక్టుల నిర్మాణమని తెలిపారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని చెప్పారు.


Tags:    

Similar News