18August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

మొయినాబాద్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చి వేస్తున్నారు. మూడు నుంచి నాలుగు అంతస్థుల భవనాలను హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చి వేస్తున్నారు.

Update: 2024-08-18 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : హైడ్రా కూల్చివేతలు ఆదివారం ప్రారంభం.. ఈసారి ఎక్కడంటే?

మొయినాబాద్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చి వేస్తున్నారు. మూడు నుంచి నాలుగు అంతస్థుల భవనాలను హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చి వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను చేపట్టారని గుర్తించిన హైడ్రా అధికారులు ఉదయం నుంచే కూల్చి వేతలు ప్రారంభించారు.

Chandrababu Delhi Tour : రెండు రోజుల ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లేనా? త్వరలో గుడ్ న్యూస్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేకంగా ఏపీని ఆదుకోవాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధులను విడుదల చేయాలని ఆయన కోరినట్లు తెలిసింది.

Onion Price : కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. ఇక ధరలు మరింత పెరుగుతాయామో?

ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలోనే ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. మొన్నటి వరకూ టమాటా ధరలు చుక్కలుచూపించగా, ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఉల్లి లేకుండా వంటింట్లో పని జరగదు. ఉల్లిపాయ లేకుండా ఏవంట చేయడం కుదరదు.

BJP : బీజేపీకి ఇదే పనా...? ప్రభుత్వాలను కూల్చడం.. అధికారంలోకి రావడమే లక్ష్యమా?

భారతీయ జనతా పార్టీకి చిన్న రాష‌్ట్రం .. పెద్ద రాష్ట్రం అనే తేడా లేదు. తాము అధికారంలో ఉండాలని కోరుకుంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కాషాయ జెండా ఎగురాలని భావిస్తుంది. అందులో తప్పులేదు. కానీ పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయడమే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కారణమయింది.

Sweeper : స్పీపర్ కు కోట్ల ఆస్తులు .. తొమ్మిది లగ్జరీ కార్లు.. మైండ్ బ్లాంక్ అవుతుందిగా?

ఉత్తర్‌ప్రదేశ్ లో ఒక స్పీపర్ కోటీశ్వరుడయ్యాడు. తొమ్మిది లగ్జరీ కార్లతో పాటు కోట్ల రూపాయల నగదును కూడా సంపాదించాడు. ఈ విషయం ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండా ిజల్లాకు చెందిన సంతోష్ జైశ్వాల్ గోండా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరిస్తామని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యం తెలిపింది. ఈరోజు నుంచే అన్ని ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Weather Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత.. ఎండాకాలాన్ని తలపిస్తున్న వాతావరణం

ఎండాకాలాన్ని తలపిస్తుంది. ఆగస్గు నెల వచ్చినా, వర్షాలు పడుతున్నా సెగ తగ్గలేదు. ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీనికి తోడు దోమల బెడదఎక్కువగా ఉండటంతో వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా జూన్, జులై నుంచి వాతావరణంచల్లబడుతుంది.

Earth Quake : రష్యాలో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

రష్యాలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూప్రకంపనలు కనిపించడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏడుగా నమోదయిందని అధికారులు తెలిపారు. భూకంపం తూర్పు కంచట్కా ద్పీపకల్ప తీరంలో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు.

ప్రముఖ గాయని సుశీల ఆసుపత్రిలో చేరిక

ప్రముఖ సినీ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పి.సుశీల వయోభారంతో వృద్ధాప్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్నారు. శనివారం ఆమెకు కడుపు నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Hyderabad : హైదరాబాద్ పబ్ లపై దాడులు.. డ్రగ్స్ లక్ష్యంగా

 హైదరాబాద్ లోని పబ్ లలో పోలీసులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని 25 పబ్ లలో నార్కోటిక్, ఎక్సైజ్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. పబ్ లకు వచ్చిన వారందరి నుంచి నమూనాలను సేకరించారు. డ్రగ్ డిటెక్టివ్ కిట్ లతో చాలా మంది నుంచి రక్తనమూనాలను సేకరించారు.


Tags:    

Similar News