19August -టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఈరోజు ఆకాశంలో సూపర్ సీన్ ఆవిష్కృతం కానుంది. సూపర్ బ్లూమూన్ కనపడుతుంది. ఈరోజు రాత్రి సూపర్ బ్లూమూన్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమవుతుంది. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

Update: 2024-08-19 12:39 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

నేడు ఆకాశంలో విచిత్రం.. శ్రావణి పౌర్ణమి రోజున సూపర్ బ్లూమూన్

ఈరోజు ఆకాశంలో సూపర్ సీన్ ఆవిష్కృతం కానుంది. సూపర్ బ్లూమూన్ కనపడుతుంది. ఈరోజు రాత్రి సూపర్ బ్లూమూన్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమవుతుంది. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

Breaking : కోల్‌కత్తా హత్యాచారం కేసులో విస్తుబోయే నిజాలు

కోల్‌కత్తాలో జరిగిన అభయ హత్యాచార ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోస్టు మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అభయ కొన ఊపిరితో ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడయింది. అభయ గొంతు నలుమడం వల్లనే చనిపోయందని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.

Hyderabad : హైదరాబాద్ ను వీడని వర్షం.. కుండపోతతో స్థంభించిన ట్రాఫిక్

 హైదరాబాద్ నగరాన్ని వర్షం వీడటం లేదు. ప్రతి రోజూ వర్షం పడుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వాసులకు వర్షం చుక్కలు చూపిస్తుంది. మధ్యాహ్నం గంటన్నర పాటు దంచికొట్టిన వర్షంతో వీధులన్నీ జలమయ్యాయి. ప్రధాన వీధుల్లోకి నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదలడం లేదు.

ఆర్టీసీ బస్సులోనే ప్రసవం... కండక్టర్ ను మెచ్చుకున్న ఎండీ సజ్జనార్

ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆర్టీసీ బస్సు కండక్టర్ తో పాటు ఆ బస్సులో ప్రయాణిస్తున్న నర్సు ఒకరు కలసి ఆ మహిళకు డెలివరీ చేయగలిగారు. దీంతో తల్లి, బిడ్డ సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Pawan Kalyan : పవన్ ఇలా మారిపోయారేంటి? ఎవరూ ఊహించి ఉండరే?

ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ కు.. ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అసలు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఎంతటి సహనం.. ఎంతటి పరిణితి.. అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కల్యాణ్ లో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Phone Tapping Case : భుజంరావుకు పదిహేను రోజులు కండిషన్ బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు డీఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు నాంపల్లి కోర్టు తీర్పు చెప్పింది. అనారోగ్యం కారణాలతోనే ఆయనకు పదిహేను రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. భుజంగరావు గతంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడటంత ఆయనకు రెండు స్టంట్లు వేశారు.

Telangana : నేడు అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్

తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా నేడు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం పది గంటలు ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు.

Tirumala : హమయ్య రష్ కొంత తగ్గినట్లే... దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూగానే ఉంది. సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. వరస సెలవులతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.

Hyderabad : ఈ వేళలు దాటితే హైదరాబాద్ సిటీలోకి నో ఎంట్రీ

 హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లారీలు, బస్సులు నగరంలోకి అనుమతించే వేళలను నిర్ణయించారు. భారీ లోడుతో వచ్చే లారీలు ఇకపై ఉదయం ఏడు గంటలు దాటితే హైదరాబాద్ నగరంలోకి అనుమతించారు. అలా వచ్చిన లారీలకు భారీ జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు.

నేడు ఒంగోలులో మాక్ పోలింగ్... రీ చెకింగ్

నేడు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రీకౌంటింగ్ కోసం వైైసీపీ తరుపున పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేశారు. ఇందుకు అవసరమైన మొత్తాన్ని చెల్లించారు. దీంతో ఎన్నికల కమిషన్ మాక్ పోలింగ్ తో పాటు రీ చెకింగ్ చేసేందుకు కూడా అనుమతించింది.


Tags:    

Similar News