(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Earthquake : ఢిల్లీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీ భూప్రకంపనలు ప్రజలను అర్ధరాత్రి భయకంపితులను చేశాయి. చైనా లో కూడా భూకంపం భారీగా సంభవించింది. ఢిల్లీతో పాటు ఎన్‌సీఆర్ లోనిఅనేక ప్రాంతాల్లో నిన్న రాత్రి భూకంపం సంభవించింది.
Anganwadi : అంగన్ వాడీ వర్కర్ల సమ్మె విరమణ.. పది డిమాండ్లకు ఓకే
ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడీ వర్కర్లు తాము చేేస్తున్న సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి విధుల్లోకి హాజరవుతామని అంగన్‌వాడీ వర్కర్లు తెలిపారు.
Ayodhya : తొలి రోజు అయోధ్యలో దర్శనానికి?
అయోధ్యలో రామాలయంలో నేటి నుంచి సామాన్య భక్తులకు దర్శనం లభించనుంది. దీంతో అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.
Hyderabad : హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. ఓకే చెబితే ఇక తిరుగులేదంతే
హైదరాబాద్ వాసులకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. మెట్రో రైలు విస్తరణకు త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ట్రాఫిక్ బాధల నుంచి హైదరాబాదీలకు విముక్తి కల్పించడానికి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.
Jai HanuMan : 'జై హనుమాన్'లో హీరో చిరు..? రానా..?
ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన 'హనుమాన్' సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి ఈ ఏడాది మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఎనిమిది మందిని కాల్చి చంపాడు.. చివరికి
అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు.
డేట్-టైమ్ చెప్పమని సవాల్ విసిరిన షర్మిల
వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఆమె పలాసలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
Rahul Gandhi : రాహుల్ పై శర్మగారికి అంత కోపమెందుకు? నాడు జరిగిన అన్యాయం ఆ అడుగులో గుర్తుకొస్తుందా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర నేడు పదో రోజుకు చేరుకుంది. అసోంలో ఆయన యాత్ర జరుగుతుంది. మణిపూర్ లో ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారు.
Breaking : నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ వన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేడు అవార్డు అందుకోనున్న గిల్
యువ క్రికెటర్ శుభమన్ గిల్ నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోనున్నారు. బీసీసీఐ ఇచ్చే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు శుభమన్ గిల్ కు దక్కింది. అత్యంత వేగంగా వన్డేల్లో రెండు వేల పరుగులు చేయడమే కాకుండా, టీం ఇండియా విజయంలో భాగస్వామిగా నిలిచినందుకు శుభమన్ గిల్ కు ఈ అవార్డు ఇవ్వనున్నారు.