టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-01-26 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Hyderabad : మధ్యాహ్నం మూడు గంటలు దాటితే మూడు రోజులు రోడ్ల మీదకు రావద్దు.. వస్తే ఇరుక్కుపోయినట్లే

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ హెవీగా ఉండనుంది. మూడు రోజులు వరస సెలవులు కావడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయిని భావించి వచ్చే వారికి హై అలర్ట్.

Pawan Kalyan : పవన్ హింట్ ఇచ్చారా....? బాబు నోటికి పవన్ తాళం వేసినట్లేనా?

జనసేన అధినేత పవన్ క‌ల్యాణ్ గతంలో వేరు. ప్రస్తుతం వేరు. ఇప్పుడు రాజకీయ అవసరం పవన్ కల్యాణ్ కన్నా చంద్రబాబుకే ఎక్కువ. అది తెలుసుకుంటే మంచిదని టీడీపీ చీఫ్ కు సుతిమెత్తని హెచ్చరికలను పవన్ పంపినట్లయింది.

Ys Jagan : రేపటి నుంచి షురూ.. జగన్ పర్యటనలకు అంతా సిద్ధం

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి తన పర్యటనలను జగన్ ప్రారంభించనున్నారు.


Padmasri : ఒక్కొక్కరిదీ ఒక్కోరకమైన ప్రతిభ.. నిరుపేదలైనా కళలనే నమ్ముకుని నేడు పురస్కారానికి

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మనోళ్లు పేదరికంలో పుట్టినా తమ రంగాల్లో నిష్ణాతులుగా మారారు. వివిధ కళల్లో గుర్పింపు తెచ్చుకున్నారు. ఉమామహేశ్వరి పుట్టింది ఆంధప్రదేశ్ లో.. పెరిగింది తెలంగాణలో. మచిలీట్నంలోని ఉమామహేశ్వరి తెలంగాణలోని వేములవాడలో ఆమె పుట్టారు.


Telangana : అహంకారాన్ని.. నియంతృత్వాన్ని జనం సహించరు

తెలంగాణ గవర్నర్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా వెళితే ప్రజలు ఊరుకోరు అని అన్నారు. గత పదేళ్లలో అలాగే ప్రభుత్వం వ్యవహరించిందన్నారు.


Nitish Kumar L నితీష్ లో "నీతి" ఎంత?.. ఇన్ని సార్లు కప్పగంతులా..? ఏ పొలిటీషియన్‌ హిస్టరీలో లేదేమో?

రాజకీయ నాయకుడు అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లాగా ఉండాలని అందరూ భావిస్తారు. ఆయన నిజాయితీ.. నిబద్ధత.. నీతి అందరికీ ఆదర్శమని చెప్పేవారు. కానీ అది మొన్నటి వరకూ రాను... రాను..

KCR : త్వరలో తాను జనంలోకి వస్తా

త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడతూ తెలంగాణ ప్రజలు నేటికీ బీఆర్ఎస్ ను విశ్వసిస్తున్నారని అన్నారు.

Chiranjeevi : మామ నుంచి కోడలి ఉపాసన వరకు.. అరుదైన అవార్డులతో గౌరవం..

మెగాస్టార్ చిరంజీవి కళామతల్లికి, ఆ రంగాన్ని నమ్ముకున్న కళాకారులకు ఎన్నో సేవలు చేశారు. ఒక నటుడి గానే కాదు మంచి మనసు ఉన్న వ్యక్తిగా కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు.

Gold Prices : ధరలు పెరగాల్సిన సీజన్ లో తగ్గడమేంటి? రీజన్ ఇదేనా?

గణతంత్ర దినోత్సవం రోజు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పెరగాల్సిన సీజన్ లో ధరలు తగ్గడం అంటే ఆషామాషీ కాదు. ఒకవైపు పెళ్లిళ్లు.. శుభకార్యాల సీజన్ అయినా ధరలు తగ్గుముఖం పడుతుండటం ఆనందమే.

Breaking : రెండు స్థానాలను ప్రకటించిన పవన్.. చంద్రబాబుకు కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీచీఫ్ చంద్రబాబు రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తే పవన్ కూడా రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. రాజోలు, రాజానగరం నుంచి తమ అభ్యర్థులు బరిలో ఉంటారని అన్నారు.


Tags:    

Similar News