టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-01-31 12:30 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Breaking : బస్సు - ట్రక్కు ఢీ 19 మంది మృతి

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

బెజవాడలో ఆగని ఫ్లెక్సీల రగడ

విజయవాడలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల గొడవ ఆగడం లేదు. వైసీపీ, జనసేన పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేయడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Modi : సహకరించండి.. చివరి సమావేశాల్లో హుందాగా వ్యవహరించండి

బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం నారీశక్తి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు


Chiru - Mahesh: 'జై హనుమాన్'లో రాముడిగా మహేష్.. హనుమాన్‌గా చిరంజీవి..

చిరంజీవి, మహేష్ బాబు.. హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్'లో నటించబోతున్నారా..? ఆ సినిమాలో చిరంజీవి హనుమంతుడిగా, మహేష్ రాముడిగా కనిపించబోతున్నారా..? దర్శకుడు ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో ఏమన్నారు..?

Parliament : సంక్షేమం - అభివృద్ధి సమానంగా పరుగులు తీస్తుంది

భారతీయ సంస్కృతి, సభ్యత ఎంతో ఉన్నతమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కొత్త పార్లమెంటులో తన తొలి ప్రసంగమిది అని అన్నారు. ఆసియా క్రీడల్లో తొలిసారి వందకు పైగా పతకాలు సాధించినందుకు గర్వంగా ఉందన్నారు.

Elon Musk Neuralink : మెదడులో చిప్.. ఇక చింతలేని జీవితమంటున్న మస్క్

మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తెలిపారు. ఇది విజయవంతమయిందని ఆయన చెప్పడంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఈ వార్త ను గమనించింది.

Breaking : త్వరలో కుమారి ఆంటీ షాపుకు సీఎం రేవంత్ రెడ్డి

కుమారి ఆంటీ షాపును తొలగించకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. స్ట్రీట్ ఫుడ్ ను అందిస్తున్న కుమారి ఆంటీ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి నిన్న ఆ షాపుపు మూసివేశారు.

Hyderabad : ఇన్నాళ్లకు సరైనోడు దొరికాడు.. చేయిచాస్తే బదిలీ వేటు.. ఖాకీ డ్రస్ నిటారుగా నిలబడిందిగా

హైదరాబాద్ పోలీసులు ఒక గాడిలో పడుతున్నట్లే కనపడుతుంది. పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తన పవరెంటో చూపిస్తున్నారు. అవినీతి మాట వినపడితే చాలు.. బదిలీవేటు వేయడమే..


Breaking : ట్రాఫిక్ చలాన్ల రాయితీ మరోసారి పొడిగింపు

పెండింగ్ చలాన్ల రాయితీని మరోసారి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకూ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

జ్ఞానవాపి కేసులో కీలక తీర్పు

జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసి కోర్టు అధికారులను ఆదేశించింది.


Tags:    

Similar News