6August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, దాని ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Update: 2024-08-06 13:59 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

బంగ్లాదేశ్ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం

ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, దాని ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Telangana : ఆగస్టు నెలలో ఉక్కబోత... వాతావరణంలో ఈ మార్పులేంటి? పెరిగిన ఏసీల వినియోగం

ఆగస్టు నెల వచ్చింది. అయితే వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు. ఉదయం పూట నుంచే ఉక్కపోత మొదలవుతుంది. బయట ఉష్ణోగ్రతలు లేకపోయినా ఉక్కబోతతో ప్రజలు అల్లాడి పోతున్నారు.

నేడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

నేడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ నెల 13వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు వీలుంటుంది. ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది.

Chandrababu : చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారా? ఆ పోస్టులను భర్తీ చేయాలని అనుకోవడం లేదా?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదు. ఇప్పటికే ఒకటో తేదీన పింఛన్లతో పాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి నెల అప్పుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ఖజానా వెలవెల పోతుంది. అడుగు ముందుకు వేయాలన్నా నిధుల లేమి వెనక్కు లాగుతుంది.

KCR : కనిపించవా.. వినిపించవా... బయటకు రావా బాబాయ్?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ క్యాడర్ ను కూడా ఆయన పట్టించుకోవడం లేదు. కనీసం ప్రజల ముందుకు వచ్చేందుకుకూడా ఆయన ఇష్టపడటం లేదు. ప్రస్తుతం ఎన్నికలు లేవు కాబట్టి ఆయన వచ్చినా ఏం ప్రయోజనం అంటున్నారు పార్టీ నేతలు.

Bangladesh : హోటల్ కు నిప్పు... 24 మంది సజీవ దహనం

బంగ్లాదేశ్ లో ఇంకా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనికపాలనలోకి వచ్చినా విధ్వంసం ఆగడం లేదు. తాజాగా ఒక హోటల్ కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారని తెలిసింది. జషోర్ జిల్లాలోని జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

సినిమా చెట్టు ఇక లేదు.. కూలిపోయిన 150 ఏళ్ల నాటి వృక్షం

సినిమా షూటింగ్ లు ఆ చెట్టు కింద ఎన్నో జరపుకున్నాయి. దాదాపు మూడు వందలకు పైగా సినిమాలు ఆ చెెట్టునీడన షూటింగ్ చేశాయి. ఎన్నో సినిమాలకు ఆ చెట్టు ఒక అడ్రస్ గా మారింది. అయితే ఆ చెట్టు నిన్న తెల్లవారు జామును నేలకూలింది. 150 ఏళ్ల నాటి ఈ చెట్టు కూలిపోవడంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

న్యూయార్క్ టైమ్ స్క్కేర్ స్ట్రీట్ లో రేవంత్ ఫొటోలు

న్యూయార్క్ టైమ్ స్క్కేర్ స్ట్రీట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలు దర్శనమిచ్చాయి. రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం రేవంత్ గత మూడు రోజులుగా అమెరికాలో పర్యటిస్తూ వివిధ పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్ఐలతో సమావేశమవుతున్నారు.

Telangana : నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈరోజు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న స్నేహారెడ్డి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులతో కలసి కాలినడకన తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన పిల్లలు అయాన్, అర్హలతో పాటు కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వచ్చిన స్నేహారెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.


Tags:    

Similar News