9August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

పేదరికానికి నైపుణ్యం అడ్డురాదు. పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్హద్ నదీమ్ జీవిత చరిత్ర వింటే ఎవరైనా ఆశ్చర్యపోకతప్పదు. భారత్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మీద విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించారు.

Update: 2024-08-09 12:29 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Arhad Nadeem : పేదరికం అడ్డురాలేదు... దూరం చేసి విసిరేశాడు అర్హద్ నదీమ్

పేదరికానికి నైపుణ్యం అడ్డురాదు. పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్హద్ నదీమ్ జీవిత చరిత్ర వింటే ఎవరైనా ఆశ్చర్యపోకతప్పదు. భారత్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మీద విజయం సాధించి స్వర్ణ పతకాన్ని సాధించారు.

Telangana : రాజ్యసభ పదవి ఆయనకేనా? హైకమాండ్ డిసైడ్ చేసిందా?

తెలంగాణలో రాజ్యసభ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ స్థానం దక్కుతుంది. బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ కే రాజ్యసభ పదవి దక్కుతుంది. కె.కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో ఈ ఎన్నిక జరుగుతుంది. కేకే రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు.

Nagababu : నాగబాబుకు పోస్టు రిజర్వ్ అయిందా? ఆ పోస్టుకు పేరు కన్ఫర్మ్ అయినట్లేనట

జనసేన అధికారంలోకి రావడానికి అనేక మంది కృషి చేశారు. అందులోనూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు అనేక మంది ఆయనకు అండగా నిలిచారు. అందులో పవన్ సోదరుడు నాగబాబు ఒకరు. నాగబాబు పార్టీలో కీలక భూమిక పోషించారు.

Kalvakuntla Kavitha : కవితకు కూడా బెయిల్ వస్తుందా? సంకేతాలు అలాగే కనిపిస్తున్నాయిగా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో బెయిల్ మంజూరు అయ్యే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వారు బెయిల్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేయనున్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి పదిహేడు నెలల నుంచి తీహార్ జైలులో ఉంటున్నఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆశలు మెరుగయ్యాయి.

Chandrababu : ఖజానా ఖాళీ అంటే కుదురుతుందా? ఇచ్చిన హామీలను అమలుపర్చేదెప్పుడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలను చేపట్టి సుమారు రెండు నెలలవుతుంది. అయితే ఆయన పదే పదే ఖజానా ఖాళీగా ఉందని చెబుతుండటంతో ఆయన ఇచ్చిన హామీల మాటేమిటన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. సూపర్ సిక్స్ హామీలు మాత్రమే కాదు..

Breaking : మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి పదిహేడు నెలల నుంచి మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉంటున్నారు. ఆయన అనేక సార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో జైల్లోనే ఉంటున్నారు. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Telangana : తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. ఫ్యూచర్ స్టేట్ గా పిలుద్దాం .. రేవంత్ పిలుపు

తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన ఇంటలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

Revanth Reddy : రేవంత్ రెడ్డి నేడు అమెరికాలో షెడ్యూల్ ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో వరస సమావేశాలు జరుపుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గూగుల్ ప్రతినిధులతో భేటీ కానున్నారు.

Neeraj Chopra : నీరజ్ చోప్రాకు రజతం.. తృటిలో మిస్ అయిన స్వర్ణం

ఒలింపిక్స్ లో జావెలెన్ త్రో లో నీరజ్ చోప్రాకు రజత పతకం వచ్చింది. గత ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి రజితంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నీరజ్ చోప్రా ఖచ్చితంగా స్వర్ణం సాధిస్తారని అనుకున్నారంతా. అయితే బ్యాడ్‌లక్ రజత పతకంతోనే ఆయన సర్దుకోవాల్సి వచ్చింది.

వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి

వీధికుక్కల దాడిలో ఒక చిన్నారి మరణించిన ఘటన తెలియవచ్చింది. నాలుగు సంవత్సరాల కీయన్స్ వీధికుక్కలు కరవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు 20 రోజులుగా నిలోఫర్ ఆసుపత్రిలో కియాన్స్ కు చికిత్స కొనసాగుతుంది. ఈరోజు కియాన్స్ మరణించినట్లు బంధువులుెతెలిపారు.

Tags:    

Similar News