11August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

నేటితో పారిస్ ఒలింపిక్స్ ముగియనుంది. రాత్రి 12.30 గంటలకు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్ ఖాతాలో ఇప్పటి వరకూ ఆరు పతకాలు వచ్చాయి. అయితే ఈరోజు వినేష్ ఫోగట్ అంశంపై న్యాయస్థానం తీర్పు ఇచ్చే అవకాశముంది.

Update: 2024-08-11 12:00 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

నేటితో ముగియనున్న ఒలింపిక్స్ ... వినేష్ ఫొగట్ కేసు మాత్రం?

నేటితో పారిస్ ఒలింపిక్స్ ముగియనుంది. రాత్రి 12.30 గంటలకు ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత్ ఖాతాలో ఇప్పటి వరకూ ఆరు పతకాలు వచ్చాయి. అయితే ఈరోజు వినేష్ ఫోగట్ అంశంపై న్యాయస్థానం తీర్పు ఇచ్చే అవకాశముంది. వినేశ్ ఫోగట్ భారత్ రెజ్లర్ పై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan : పవనూ...ప్రశ్నించడం ఆగిందా? ప్రశంసించడానికే పరిమితమయిందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఎంత దూకుడుగా ఉండేవారో ఇప్పుడు సాధుజీవిగా మారారు. అసలు మాట్లాడటమే మానేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ప్రశ్నించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎవరికైనా బయట ఉండి చూస్తే అంతా బాగానే కనిపిస్తుంది.

తుంగభద్ర నుంచి ఒక్కసారి వచ్చి పడుతున్న లక్ష క్యూసెక్కులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హైఅలెర్ట్

తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయింది. వరదలకు డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో నీరంతా కిందకు పారుతుంది. దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు కిందకు రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యే అవకాశాలున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని హోస్‌పేట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో తుంగభద్ర డ్యామ్ కు ఉన్న 19వ గేటు కొట్టుకుపోయింది.

Corona Virus : కరోనా మళ్లీ కోరలు చాస్తుందా? ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ విన్నారా?

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. కొన్ని దేశాల్లో వైరస్ కోరలు చాస్తుంది. ఎక్కువ శాతం కరోనా వైరస్ బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఈ కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలపింది.

రైల్లో దొంగలు పడ్డారు... దోపిడీకి ప్రయత్నించారు కాని ...?

రైల్లో దొంగతనం చేయడానికి కొందరు ప్రయత్నించారు. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ లో చోరీకి దొంగలు యత్నించారు. పల్నాడు జిల్లా నడికుడి రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ లోని బీ 5, ఎస్ 10, ఎస్ 13 బోగీల్లో కొందరు దూరి దోపిడీకి ప్రయత్నించారు.

Janasena : జనసేన సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్‎ ఆ పదవి వస్తుందనే ఆశపెట్టుకున్నారా?

మండలి బుద్ధ ప్రసాద్ అంటే పరిచయం అక్కరలేని పేరు. కులాలు, మతాలకు అతీతంగా ఆయనను అందరూ అభిమానిస్తారు. మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబం అంటే అదొక గౌరవం. అదొకరకమైన ఆప్యాయత. వివాదాల జోలికి పోరు. అవినీతి మచ్చ తనకు అంటనివ్వరు. మృదుస్వభావి.

Andhra, Telangana : చంద్రబాబు, రేవంత్‌ల సమావేశం తర్వాత పురోగతి ఏదీ? ఏదో జరగరానిది జరిగినట్లుందే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వీరి సమావేశం జరిగి నెల రోజులు దాటుతోంది. జులై 6వ తేదీన ప్రజాభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఉన్నతాధికారులు, మంత్రులు హాజరై కొంత హడావిడి అయితే జనంలో తేగలిగారు.

Chandrababu : చంద్రబాబు త్వరలో గుడ్ న్యూస్ చెబుతారా? ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అప్పటి నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

KTR : అమరరాజా ఇక్కడి నుంచి వెళ్లిపోతుందటగా

అమరరాజా సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దన్నారు. బ్రాండ్ తెలంగాణ ఇమేజ్‌కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని కోరారు.

Congress : కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్ మరణించారు. నట్వర్ సింగ్ కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. నట్వర్ సింగ్ వయసు 95 సంవత్సరాలు. ఆయన వృద్ధాప్యంలో అనారోగ్యం కారణంగా గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో నట్వర్‌సింగ్ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags:    

Similar News