మైనారిటీలోనే... సీఎంగా ఫడ్నవిస్

మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్క్స్ కు చేరుకున్నాయి. రేపు అసెంబ్లీలో బలపరీక్షను ఉద్ధవ్ సర్కార్ ఎదుర్కొననుంది.

Update: 2022-06-29 07:44 GMT

mumbai : మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్క్స్ కు చేరుకున్నాయి. రేపు అసెంబ్లీలో బలపరీక్షను ఉద్ధవ్ సర్కార్ ఎదుర్కొననుంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో చెప్పలేం కాని, గవర్నర్ ఆదేశాల ప్రకారం రేపు బలపరీక్షను ఉద్ధవ్ థాక్రే ఎదుర్కొనాలి. అదే జరిగితే మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయంగానే కన్పిస్తుంది. పైకి ఎన్ని మాటలు చెబుతున్నా శివసేన ను కాదనుకుని వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కు వచ్చే అవకాశమే లేదు.

మ్యాజిక్ ఫిగర్...
మహారాష్ట్రలో 188 అసెంబ్లీ స్థానాలున్నాయి. బలపరీక్షలో గట్టెక్కాలంటే 144 సభ్యుల మద్దతు అవసరం. మహావికాస్ అగాడీ ప్రభుత్వానికి ప్రస్తుతం 119 మంది సభ్యుల కంటే ఎక్కువ లేరు. శివసేన 16, కాంగ్రెస్ 44, ఎన్సీపీ 53 మంది ఉన్నారు. కానీ బీజేపీకి గతంలోనే 113 మంది అభ్యర్థు మద్దతు ఉంది. వీరితో షిండే వర్గం కలిస్తే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తుంది. ఏక్‌నాధ్ షిండే వర్గం లో దాదాపు నలభై మంది వరకూ ఉన్నారు.
ఏక్‌నాధ్ కు డిప్యూటీ..
బీజేపీ ఏక్‌నాథ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చేందుకు సిద్ధమయింది. షిండే వర్గంలోని పది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరిందని సమాచారం. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మీద ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కన్పిస్తుంది. మలబార్ లోని ఫడ్నవిస్ ఇంటి వద్ద హడావిడి మొదలయింది. మరింత భద్రతను ఫడ్నవిస్ కు కల్పించారు.


Tags:    

Similar News