రాముని రాకే.. మాకు మంచి ముహూర్తం
అయోధ్య రామ మందిర పునఃప్రారంభోత్సవం దేశమంతా పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎన్నో మంచి పనులకి ఆ రోజే శ్రీకారం చుడుతున్నారు. రాముని ప్రతిష్ట సమయమే అద్భుతమైన ముహూర్తం అని కాబోయే తల్లులంతా ఫిక్స్ అయినట్లున్నారు.
అయోధ్య రామ మందిర పునఃప్రారంభోత్సవం దేశమంతా పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఎన్నో మంచి పనులకి ఆ రోజే శ్రీకారం చుడుతున్నారు. రాముని ప్రతిష్ట సమయమే అద్భుతమైన ముహూర్తం అని కాబోయే తల్లులంతా ఫిక్స్ అయినట్లున్నారు. దేశవ్యాప్తంగా ఆ ముహుర్తానికే తమకు బిడ్డ పుట్టాలని ఆశిస్తున్నారు. డెలివరీకి ఓ వారం పది రోజులు టైం ఉన్నా, జనవరి 22 వరకూ వెయిట్ చేయాలని చాలా కుటుంబాలు నిర్ణయించుకుంటున్నాయి. ఓ నాలుగైదు రోజుల ముందుగా కాన్పు అయ్యే అవకాశమున్నా, డాక్టర్ సలహాతో వాయిదా వేసుకుంటున్నారు.
జనవరి 22 మధ్యాహ్నం కాన్పు చేయాలని ఇప్పటి వరకు 15 కుటుంబాలు తమను ఆశ్రయించాయని గైనకాలజిస్ట్ డాక్టర్ సీమా ద్వివేది చెప్పారు. ఆమె కాన్పూరు లోని జీఎస్వీ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఈ మధ్య సిజేరియన్ డెలివెరీలు సర్వ సాధారణం అయిపోయాయి. పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు కోసం మంచి ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకోవడం కూడా సహజం అయిపోయింది. సిజేరియన్ కాబట్టి, రాముని ప్రతిష్ట లాంటి మంచి ముహూర్తాన్ని మిస్ చేసుకోకూడని కాబోయే తల్లిదండ్రులు భావిస్తున్నారు. దేశమంతా ఇదే పరిస్థితి ఉందని పలు ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తరాదిలోఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలో దేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అంశం బహుశా రామ నామమే కావచ్చు.